నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు:జగన్

By narsimha lodeFirst Published Mar 3, 2020, 4:25 PM IST
Highlights

నెలరోజుల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
 

అమరావతి: నెలరోజుల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పంచాయితీ రాజ్ ఎన్నికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

డబ్బులు, లిక్కర్ పూర్తిగా నిరోదించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్ తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పోలీసులు చాలా దృఢంగా చేయాలి.... ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు. డబ్బులు పంచినట్లు ఎన్నికల తర్వాత తెలినా అనర్హత వేటు వేస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పారు.

ఎక్కడా కూడ డబ్బులు, లిక్కర్ పంచినట్టుగా ఉండకూడదన్నారు.  మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ దేశంలో ఆదర్శంగా నిలవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.  ఎన్నికల్లో డబ్బులు పంచినట్టుగా ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధించడంతో పాటు మూడేళ్లపాటు జైలు శిక్ష విధిస్తామన్నారు.

జిల్లా ఎస్పీలు డబ్బులను, మద్యాన్ని అరికట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాలని సీఎం ఆదేశించారు. 
 
ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే వ్యక్తులు ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. రియల్ ఏస్టేట్ వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావొద్దన్నారు. 

సాధారణ ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడ ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం ప్రకటించారు.


 

click me!