వలపు వలతో మోసం : మాయలేడీపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు

Published : Jun 06, 2021, 03:12 PM IST
వలపు వలతో మోసం : మాయలేడీపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

వ్యాపారులను లక్ష్యంంగా చేసుకొని వలపు వల విసురుతున్న మాయలేడి బాగోతం వెలుగు చూసింది.  ధనవంతులకు వలపు విసిరి డబ్బులు వసూలు చేస్తోంది.  ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న మహిళపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది.

విజయవాడ: వ్యాపారులను లక్ష్యంంగా చేసుకొని వలపు వల విసురుతున్న మాయలేడి బాగోతం వెలుగు చూసింది.  ధనవంతులకు వలపు విసిరి డబ్బులు వసూలు చేస్తోంది.  ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న మహిళపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది.

అమాయకులను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి  డబ్బులు కొట్టేస్తున్నట్టుగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓ యువకుడి నుండి రూ. 80 లక్షలు కొట్టేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  వలపు వల విసురుతూ మోసాలకు పాల్పడుతున్న శ్రీదివ్యతో పాటు ఆమె తమ్ముడు పోతురాజు ఆమెకు సహకరిస్తున్న రజాక్ పై బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ తరహాలోనే మోసపోయిన పలువురి నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పలు ఆస్తి వివాదాలను సెటిల్ చేస్తామని కూడ ఆమె డబ్బులు స్వాహా చేశారని ఆరోపణలు కూడ  వెల్లువెత్తాయి. గతంలో కూడ ఇదే తరహలో ఓ మహిళ మోసాలకు పాల్పడుతున్న విషయం పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu