ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కన్నుమూత

By Siva KodatiFirst Published Jun 6, 2021, 3:03 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ.. ఆదివారం హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ.. ఆదివారం హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలముకుంది. వారి స్వస్థలం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల . కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, కాసు బ్రహ్మానందరెడ్డి 1994లో కన్నుమూశారు. ఆయన వారసుడిగా కాసు వెంకట కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణారెడ్డి ఎంపీగానూ వ్యవహరించారు. కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్ వైసీపీ నుంచి ప్రస్తుతం గురజాల శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. 

click me!