మాజీ స్పీకర్ కోడెల అక్రమాలపై ఫిర్యాదులు : "కే"ట్యాక్స్ పై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఫైర్

By Nagaraju penumalaFirst Published Jun 11, 2019, 11:01 AM IST
Highlights

ఒకరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమ పార్టీకి గానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గానీ లేదన్నారు. ప్రజలు ఫిర్యాదులు చేస్తూ మీడియా ముందు వాపోతుంటే అది రాజకీయ కక్ష సాధింపా అంటూ నిలదీశారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. 

తిరుమల: కే ట్యాక్స్ ఆరోపణలు ఎదుర్కొంటుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ స్పీకర్ కోడెల కుటుంబం అవినీతికి అడ్డే లేకుండా పోయిందని ఆరోపించారు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ స్పీకర్ కోడెల చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ప్రస్తుతం కోడెల బాధితులు అంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారని గుర్తు చేశారు. 

బాధితులు ఎవరైనా పోలీసులను ఆశ్రయించవచ్చునని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు కోడెల శివప్రసాదరావు కుటుంబంపై కే ట్యాక్స్ ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 

click me!