కమెడియన్ పృథ్వీకి కీలక పదవి ఇచ్చిన వైఎస్ జగన్

By telugu teamFirst Published Jul 13, 2019, 1:57 PM IST
Highlights

తన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ కోసం ప్రచారం చేసిన తెలుగు కమెడియన్ పృథ్వికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన పదవిని అప్పగించారు.

అమరావతి: తన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాకుండా పార్టీ కోసం ప్రచారం చేసిన తెలుగు కమెడియన్ పృథ్వికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన పదవిని అప్పగించారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా ఆయనను నియమించారు. 
 
టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయ ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో చానల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియమితులయ్యారు. 

దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే చానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీ అయింది.  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీలో చేరారు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం విదితమే.

click me!