అనంతపురంలో విద్యార్ధిపై హాస్టల్ వార్డెన్ దాడి

Published : Jul 09, 2019, 04:45 PM ISTUpdated : Jul 09, 2019, 04:50 PM IST
అనంతపురంలో విద్యార్ధిపై హాస్టల్ వార్డెన్ దాడి

సారాంశం

ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న  యశ్వంత్ అనే విద్యార్ధిపై హాస్టల్ వార్డెన్ దాడికి దిగారు.  క్రమశిక్షణ పేరుతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు


  అనంతపురం: ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న  యశ్వంత్ అనే విద్యార్ధిపై హాస్టల్ వార్డెన్ దాడికి దిగారు.  క్రమశిక్షణ పేరుతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నారు.హాస్టల్ లో ఉంటున్న సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవను లెక్చరర్లు ఆపారు. 

ఈ విషయమై హాస్టల్ వార్డెన్  క్రమశిక్షణ చర్యలు తీసుకొనే పేరుతో కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అనంతపురం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఈ దాడిని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

 జూనియర్లు,సీనియర్ల మధ్య ర్యాగింగ్ జరిగింది.ఈ విషయమై క్రమశిక్షణ పేరుతో హాస్టల్ వార్డెన్ కొట్టినట్టుగా సమాచారం. అయితే ర్యాగింగ్ జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu