శ్రీకాకుళంజిల్లాలో కాలేజీ విద్యార్థిని కిడ్నాప్.. సైకిల్ పై కాలేజీకి వెడుతుంటే కారులో వచ్చి ఎత్తుకెళ్లి...

Published : Jul 03, 2023, 01:40 PM IST
శ్రీకాకుళంజిల్లాలో కాలేజీ విద్యార్థిని కిడ్నాప్.. సైకిల్ పై కాలేజీకి వెడుతుంటే కారులో వచ్చి ఎత్తుకెళ్లి...

సారాంశం

సైకిల్ మీద కాలేజీకి వెడుతున్న ఓ విద్యార్థినిని కారులో వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శ్రీకాకుళంలో కలకలం రేపింది.

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ అమ్మాయి కిడ్నాప్ కలకలం రేపింది. దుర్గా భవానీ అనే అమ్మాయి  శ్రీకాకుళ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటోంది. సోమవారం సైకిల్ పై కాలేజీకి వెడుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన యువతి. ఇటీవలే దుర్గా భవానీకి వివాహం అయ్యింది. 

వివాహం అయ్యింది కానీ.. దుర్గా భవానికి కాపురానికి వెళ్లలేదు. తల్లిగారింటిదగ్గరే ఉండి చదువుకుంటోంది. దీంతో కిడ్నాప్ చేసింది ఆమె భర్తే అయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సోమవారం ఎచ్చెర్లలోని నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో సైకిల్ మీద వెడుతుండగా కిడ్నాప్ జరిగింది. 

విషయం తెలిసిన వెంటనే అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు దీనిమీద ఫిర్యాదు చేశారు. భర్త మీదే తమకు అనుమానం ఉందంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం