మ‌న్యం ప‌ర్య‌ట‌న‌లో 'అమ్మఒడి' నిధులు విడుద‌ల చేయ‌నున్న సీఎం జ‌గ‌న్

By Mahesh RajamoniFirst Published Jun 27, 2023, 4:40 PM IST
Highlights

Amaravati: మ‌న్యం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి "అమ్మ ఒడి ప‌థ‌కం" నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దాదాపు 44 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 15 వేల రూపాయ‌ల చొప్పున నిధులు జమ కానున్నాయి.
 

Amma Vodi programme: మ‌న్యం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి "అమ్మ ఒడి ప‌థ‌కం" నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. దాదాపు 44 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 15 వేల రూపాయ‌ల చొప్పున నిధులు జమ కానున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. బుధవారం (జూన్ 28న‌) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పర్యటించనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే బహిరంగ సభలో ఈ ఏడాది అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు చినమేరంగి చేరుకుంటారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నిర్మించిన హెలిప్యాడ్ పై దిగనుందని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. అక్క‌డి నుంచి కురుపాం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో పార్టీ మద్దతుదారులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కురుపాంలో వైఎస్ జగన్ అమ్మఒడి పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

Latest Videos

అమ్మ ఒడి నిధులు విడుదల చేయ‌నున్న సీఎం జ‌గ‌న్.. 

గనన్న అమ్మఒడి నిధులను ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (బుధ‌వారం) కురుపాంలో పాఠశాలకు పంపే తల్లుల ఖాతాల్లో జమ చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పథకంలో భాగంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు ఆర్థిక సాయంగా జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది. అమ్మఒడి పథకం కింద మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు కేటాయించి గత ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది.

ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరమవ్వకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నద‌ని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పేదలు చదువును కొనసాగించి అభివృద్ధి చెందడానికి ఆర్థిక సహాయం అందించేందుకు వివిధ పథకాలను తీసుకువస్తున్నద‌ని చెప్పారు.

click me!