
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎంజగన్.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, ఈ సందర్భంగా నవంబర్ 1న జరగనున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సీఎం జగన్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సీఎం జగన్ రాజ్‌భవన్‌లో జరిగిన ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక, శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తుల చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.