ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన సమావేశం..

Published : Dec 28, 2022, 02:05 PM IST
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన సమావేశం..

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రానికి ఆర్థిక చేయూత అందించాల్సిందిగా మోదీని సీఎం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. 

ఇక, సీఎం జగన్ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులపై ఆయనతో జగన్ చర్చించనున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే సీఎం జగన్.. కుదిరితే మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏపీలో హైటెక్ సిటీ, 400కే కిలో మ‌ట‌న్‌, ఓయో గుడ్ న్యూస్‌.. 2025లో ఏసియానెట్ తెలుగులో ఎక్కువ‌గా చ‌దివిన వార్త‌లివే
School Holidays : జనవరి 1న విద్యాసంస్థలకు సెలవు ఉందా..? మీకు ఈ మెసేజ్ వచ్చిందా..?