సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన రద్దు.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 12:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడపకు బయలుదేరాల్సి ఉంది. అయితే సీఎం జగన్ కడప పర్యటన రద్దైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటన రద్దైంది. ఈరోజు ఉదయం సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడపకు బయలుదేరాల్సి ఉంది. కడప చేరుకున్న సీఎం జగన్.. రేపటి నుంచి పెద్ద దర్గా (అమీన్‌పీర్ దర్గా) ఉత్సవాలు ఆరంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్‌ను సమర్పించాలని నిర్ణయించారు. అయితే ఈ రోజు ఉదయం కడప పర్యటనకు బయలుదేరేందుకు జగన్ సిద్దం కాగా.. కడప ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ క్లియరెన్స్ రాలేదు. అయితే కొంతసేపు సీఎం జగన్ వేచిచూసినప్పటికీ.. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో తన కడప రద్దు చేసుకున్నారు. 

ఇక, కడప పర్యటనలో భాగంగా సీఎం జగన్.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే తన సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌ వేడుకకు కూడా హాజరు కావాల్సి ఉండింది. అయితే సీఎం జగన్ కడప పర్యటన రద్దు  కావడంతో.. పెద్ద దర్గా వద్ద, మాధవి కన్వెన్షన్‌ వద్ద మోహరించిన పోలీసులు వెనుదిరుగుతున్నారు. 
 

click me!