
అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో పోస్టుల భర్తీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నిమామకానికి ఆమోద ముద్ర వేశారు. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భర్తీ చేసే పోస్టుల్లో యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నాయి.