ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరైన జగన్: చంద్రబాబు దూరం

Siva Kodati |  
Published : Jan 26, 2020, 06:08 PM IST
ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరైన జగన్: చంద్రబాబు దూరం

సారాంశం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో  ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో  ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి ఛైర్మన్ షరీఫ్, మంత్రులు బొత్ సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు  పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. 

Also Read:సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు: పేర్లు ఇవ్వాలని పార్టీలకు షరీఫ్ లేఖ

అంతకుముందు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్‌లో జ్యుడీషియల్‌ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గవర్నర్ చెప్పారు. .

పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ది, పాలనా వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హరిచందన్  అభిప్రాయపడ్డారు.  

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చిందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయన్నారు.

Also Read:మండలి రద్దుపై రేపు జగన్ కీలక ప్రకటన: సమావేశాలకు టీడీపీ దూరం

సచివాలయల ఏర్పాటుతో 4లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.  . రైతు భరోసా పథకం రూ.13,500 మందికి ఇస్తున్నామన్నారు.  ధరల స్థిరీకరణ కోసం రూ.3 కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రైతులకు 9గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తోన్న విషయాన్ని  గవర్నర్ గుర్తు చేశారు. 100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతోందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా కూడ తెలుగును తప్పనిసరి చేసిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయిన కమాండో | Commando Collapses | Asianet News Telugu
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu