ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని మోదీతో భేటీ

Published : Aug 21, 2022, 12:01 PM IST
ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని మోదీతో భేటీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి  బయలుదేరనున్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి  బయలుదేరనున్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో జగన్ చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కూడా సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. ఇక, అనంతరం అందుబాటులో ఉన్న కొందరు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలవనున్నారు. కుదిరితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Weather Update : చలికి గుడ్ బై.. ముదురుతున్న ఎండలు, ఈ ప్రాంతాల్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్స్