ఉండవల్లి ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం

Siva Kodati |  
Published : Jun 24, 2019, 10:29 AM IST
ఉండవల్లి ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం

సారాంశం

ఉండవల్లి ప్రజావేదికలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది

ఉండవల్లి ప్రజావేదికలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. అవినీతిరహిత పాలన, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల నియామకం, 108, 104 సర్వీసుల పనితీరు, రేషన్ సరుకుల డోర్ డెలివరీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు తొలి రోజు కలెక్టర్ల సదస్సు ముగియనుంది. వచ్చే ఏడాది ఉగాది నాటికి సంతృప్త స్థాయిలో పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సోమవారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?