ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి.. చంద్రబాబును సీఎం చేసేందుకు కుట్రలు: సీఎం జగన్

Published : Oct 17, 2022, 01:17 PM IST
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి.. చంద్రబాబును సీఎం చేసేందుకు కుట్రలు: సీఎం  జగన్

సారాంశం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఇంత తోడుగా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఇంత తోడుగా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగో ఏడాది  వైఎస్ఆర్  రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి ఏటా కరువేనని విమర్శించారు. చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలు అన్నట్టుగా అప్పుడు పాలన సాగిందని విమర్శించారు. 

ఈ ఏడాది కూడా సాధారణం  కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయని అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబ రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. 

చంద్రబాబు సున్నా వడ్డీ కింద రూ. 685 కోట్లు చెల్లిస్తే.. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్లలో సున్నా వడ్డీ కింద రూ. 1282 కోట్ల చెల్లించామని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం ఇస్తున్నామని చెప్పారు. అప్పటికీ, ఇప్పటికీ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పు వచ్చిందని అన్నారు. ఉచితంగా పంట బీమా అందజేస్తున్నామని చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. 

పండ్లు పడించే చెట్టు మీదే రాళ్లు పడినట్టుగా.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికి తెలుసని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. ఇప్పుడు జీవితాలు బాగున్నాయా? లేదా? అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రైతుల కోసం మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో 1,33,527 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే 1,74, 931 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ల‌లో జమ చేయడం జరిగిందన్నారు. 

అప్పుడు, ఇప్పుడు ఒకే బడ్జెట్.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చేస్తున్న అప్పుల గ్రోత్ రేట్ తక్కువేనని అన్నారు. ఇప్పుడు చేస్తున్న పనులు.. అప్పట్లో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయాలని కోరారు. అప్పటి పాలనకు.. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించాలని అన్నారు. గజ దొంగల ముఠా మంచిని చెప్పదని.. కుట్రలే చస్తుందని అన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

గతంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో అనే పథకం అమలయ్యేదని విమర్శించారు. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలవుతుందని చెప్పారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని అన్నారు. మంచి నిలబడాలని, అన్ని ప్రాంతాలకు మేలు జరగాలని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం