రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం.. గత ప్రభుత్వం చేసింది మోసమే: సీఎం జగన్

Published : Jul 20, 2022, 01:24 PM IST
రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం.. గత ప్రభుత్వం చేసింది మోసమే: సీఎం జగన్

సారాంశం

నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పోర్టు రావడం వల్ల ఎకానమిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. 

నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్ని ఆయన ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పోర్టు రావడం వల్ల ఎకానమిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పోర్టులో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అని అన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చిన ప్రభుత్వం వైసీపీ అని చెప్పారు. 

రాష్ట్రంలో ఉన్న 6 పోర్టులు కాకుండా.. మరో నాలుగు పోర్టులు తెస్తున్నామని జగన్ చెప్పారు. త్వరలోనే మిగిలిన పోర్టులకు భూమి పూజ చేయనున్నట్టుగా తెలిపారు. 9 ఫిషింగ్ హర్బర్లు, 4 పోర్టులు పనులు వేగవంతం చేశామని అన్నారు. 9 ఫిషింగ్ హార్బర్ల ద్వారా లక్ష మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన చేసిందని జగన్ గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నాయని భూసేకరణ చేయకుండా,  డీపీఆర్ లేకుండా ప్రజలను మోసం చేసేందుకు 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని చెప్పారు. ఐదేళ్లు ఏం చేయకుండా ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడమంటే.. ఇంతకంటే అన్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. 

పోర్టు రావడానికి సహకరించిన గ్రామాల ప్రజలకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా లోన్‌లు ఇచ్చిన ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకులకు కూడా కృతజ్ఞతలు  తెలియజేశారు. పోర్టు కోసం భూములిచ్చిన పలువురు రైతులకు పునరావాస చర్యల్లో భాగంగా సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్