పేర్ని నాని కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్

Published : Nov 21, 2020, 02:21 PM IST
పేర్ని నాని కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్

సారాంశం

నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.


సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

నాగేశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే నయం అయిందని భావించి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేయగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కాగా, నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సమాచార మంత్రిత్వ శాఖను నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!