వైఎస్సార్ జిల్లాలో పర్యటన.. చిత్రావతి రిజర్వాయర్‌‌లో సీఎం జగన్ బోటింగ్..

By Sumanth KanukulaFirst Published Dec 2, 2022, 2:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్ద బోటింగ్ సౌకర్యాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు, రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్.. వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్ద బోటింగ్ సౌకర్యాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జెట్టీలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పలువురు అధికారులతో కలిసి సీఎం జగన్ బోటింగ్ చేశారు. జగన్‌తో సహా బోట్‌లోని అందరూ లైఫ్ జాకెట్స్ ధరించారు. అనంతరం లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైఎస్సార్ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తర్వాత  లింగాల మండలానికి చెందిన వైసీపీ నాయకులతో జనగ్ సమావేశం కానున్నారు. 


అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక, శనివారం పులివెందుల భాకాపురం చేరుకోనున్న సీఎం జగన్.. కదిరి రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరగనున్న తన వ్యక్తిగత సహాయకుడు రవిశేఖర్ కూతురు వివాహా వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం తిరిగి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు. ఇక, సీఎం జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!