కత్తి పద్మారావు వీల్ చైర్ సరిచేసిన సీఎం జగన్.. వీడియో వైరల్..!

Published : Nov 02, 2021, 12:31 PM ISTUpdated : Nov 02, 2021, 12:35 PM IST
కత్తి పద్మారావు వీల్ చైర్ సరిచేసిన సీఎం జగన్.. వీడియో వైరల్..!

సారాంశం

ఈ పురస్కార కార్యక్రమంలో సాహిత్యం విభాగంలో కత్తి పద్మారావును వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.  విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా.. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఓ పని ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పురస్కార కార్యక్రమంలో సాహిత్యం విభాగంలో కత్తి పద్మారావును వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది.

Also Read: విజయవాడలో విశాఖ బిల్డర్ దారుణ హత్య.. ఆ సంబంధమే కారణమా???

దళిత సామాజిక వేత్త, రచయిత కత్తి పద్మారావు వీల్ చెయిర్ లో ఉండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కత్తి పద్మారావు అవార్డు అందుకునేందుకు పైకి లేవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. దాంతో సీఎం జగన్ స్వయంగా చేయందించి ఆయనను పైకి లేపారు. అనంతరం అవార్డు ప్రదానం చేశారు. ఆపై వీల్ చెయిర్ కదలకపోవడంతో సీఎం జగన్ స్వయంగా  పెడల్స్ ను సరిచేశారు. సీఎం అంతటివాడు తన పట్ల అంత శ్రద్ధ చూపడం పట్ల కత్తి పద్మారావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభికులను విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read: క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం... అమరజీవికి సీఎం జగన్ నివాళి (ఫోటోలు)

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. జగన్.. చాలా హుందాగా ప్రవర్తించారంటూ.. ఇప్పుడు వైసీపీ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్