విజయవాడలో విశాఖ బిల్డర్ దారుణ హత్య.. ఆ సంబంధమే కారణమా???

Published : Nov 02, 2021, 10:50 AM IST
విజయవాడలో విశాఖ బిల్డర్ దారుణ హత్య.. ఆ సంబంధమే కారణమా???

సారాంశం

దసరా పండుగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లే ఇంతలోనే Murderకు గురికావడంతో బంధువులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

విజయవాడ :  విశాఖ నగరానికి చెందిన  పీతల అప్పల రాజు అలియాస్ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది.  దీనిపై పోలీసులు  విభిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

విశాఖ ఎంవిపి కాలనీ కి చెందిన  అప్పలరాజు  విజయవాడకి వెళ్లి Builder గా ఎదిగారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ క్రిష్ణ హోటల్ కూడలిలో ఆర్పీ కన్స్ట్రక్షన్స్ పేరుతో కార్యాలయ నడుపుతున్నారు.  రాజుకు భార్య  ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కుమారుడు ప్రవీణ్ ఎంబీఏ చదువుతున్నాడు.  
కుమార్తె రేష్మకు ఆగస్టులో  విశాఖలోనే వివాహం చేశారు.  సుమారు మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను తీసుకుని MVP Sector-9 లో సొంత ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు.  తాను Vijayawadaలోనే ఉంటూ భవన నిర్మాణ  కాంట్రాక్టులు చేస్తున్నారు.  దసరా పండుగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లే ఇంతలోనే Murderకు గురికావడంతో బంధువులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో…
అప్పలరాజు అతడి వద్ద పనిచేసే సాయికుమార్ ఓకే భవనంలో అద్దెకు ఉంటున్నారు.  బిల్డర్ పై అంతస్తులో సాయికుమార్ తన కుటుంబంతో కలిసి  కింది అంతస్తులో ఉంటున్నారు.  పనిచేసే మరో వ్యక్తి వెంకటేష్ సోమవారం ఉదయం వారి వద్దకు వచ్చాడు.  అప్పలరాజు ఫోన్ లిఫ్ట్ చేయడం  లేదని సాయి కుమార్ తో అన్నాడు.  దీంతో పైకి వెళ్లి చూడగా బిల్డర్ హత్య వెలుగుచూసింది.

అసలేం జరిగి ఉంటుంది...??
అప్పలరాజు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  అతడికి వాంబే కాలనీ లో యువతి తో Intimate relationship ఉందని తెలియడంతో.. అదేమైనా హత్యకు కారణమా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.  మరోవైపు తన కుటుంబాన్ని విజయవాడ నుంచి ఎందుకు విశాఖపట్నంకు తరలించారు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

మూడేళ్ల క్రితం భార్యతో తలెత్తిన Conflicts నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.  తాజాగా విజయవాడ విశాలాంధ్ర కాలనీలో స్థలం కొనుగోలు విషయంలో కొద్ది చోటు చేసుకున్నట్లు తెలుస్తుండగా  ఆయా వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.  మృతుడి ఫోన్ లోని రికార్డులు,  సమీపంలోని మద్యం దుకాణం,  ఇతర ప్రాంతాల్లోని  సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే  మరిన్ని వివరాలు తెలుస్తాయని నున్న సీఐ హనీష్ బాబు తెలిపారు.

కుటుంబం పరువు తీసిందని.. కొడుకు లేని సమయంలో.. కోడలిని చంపిన మామ..!

క్రిష్ణ హోటల్ సెంటర్ లో నివాసముంటున్న మృతుడి తోడల్లుడు దుర్గారావు,  మరదలు రాజి  ఘటనా స్థలానికి వచ్చారు.  బిల్డర్ మెడలో ఉండాల్సిన బంగారు గొలుసులు చేతికి ఉండాల్సిన రెండు ఉంగరాలు లేవని పోలీసులకు చెప్పడంతో..  ఎవరైనా  ఆగంతకులు  నగల కోసం హత్య చేసి ఉంటారా?  అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.

 హత్యోదంతంతో పెద్ద సంఖ్యలో బిల్డర్లు,  పరిచయస్తులు తరలివచ్చారు.  మధ్యాహ్నం సమయానికి అతని కుటుంబ సభ్యులు నగరానికి చేరుకున్నారు. జిజీహెచ్ లో ఉంచిన  భౌతిక కాయాన్ని చూసి  వారు కన్నీరుమున్నీరయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్