దూసుకొస్తున్న పెథాయ్.. అధికారులు అప్రమత్తం

By ramya neerukondaFirst Published Dec 15, 2018, 11:37 AM IST
Highlights

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీహరి కోటకు 790కిలోమీట్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది.

పెథాయ్ తుపాను  అతి వేగంగా దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీహరి కోటకు 790కిలోమీట్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఈ రోజు మధ్యాహ్నానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన తీరందాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ తుఫాను ప్రభావం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తుఫాను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి తుఫాను వివరాలను తెప్పించుకొని పరిశీలించారు. ప్రాణ నష్టం  జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా మందే తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

click me!