ప్రజల్లో సంతృప్తి ఉందా? లేదా?

First Published Sep 20, 2017, 1:56 PM IST
Highlights
  • రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్న సీఎం చంద్రబాబు
  • ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు.
  • కలెక్టర్ల సమావేశం వచ్చే సరికి తమ ప్రభుత్వం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఆయన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కావస్తోంది. ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఆయన గానీ.. ఆయన మంత్రి వర్గంలోని మంత్రలుగానీ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు. కానీ.. కలెక్టర్ల సమావేశం వచ్చే సరికి తమ ప్రభుత్వం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

 

మొన్నటి దాకా.. రాష్ట్రంలోని 80శాతం మంది ప్రజలు తమ పాలనతో సంతృప్తిగా ఉన్నారన్న చంద్రబాబు.. ఇప్పుడు.. 80శాతం మంది ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద వేశారు.  ప్రజలు నిజంగా సంతృప్తిగా ఉంటే.. కొత్తగా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించడం ఎందుకు అనే ప్రశ్న వినపడుతోంది. అంటే.. నిజంగానే ప్రజలు తమ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్న విషయం సీఎం ఒప్పుకున్నట్లే కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. 50శాతం మంది మాత్రం సంతృప్తిగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. అంటే ఆయన మాటల ప్రకారం.. ఇంకా 30శాతం మంది ప్రజలను ప్రభుత్వానికి ఆకర్షితులుగా చేసే పని ఇప్పుడు కలెక్టర్లదనమాట. అంతెందుకు మొన్నటికి మొన్న పార్టీ సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో 41శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని స్వయంగా చంద్రబాబే చెప్పడం గమనార్హం.

 

  కాకినాడ, నంద్యాల ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని వాటిని మోడల్ గా తీసుకొని పనిచేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. అంటే.. ఇన్ డైరెక్ట్ గా కలెక్టర్లు తమ పార్టీ కోసం పనిచేయాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. సరైన వర్షాలు పడక.. నీరు లేక.. ఈ ఏడాది పంటలు పండలేదురు బాబూ.. అని రైతులు మొరపెట్టుకుంటుంటే.. వ్యవసాయ పరంగా అభివృద్ధి సాధించాం అనిచెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం హార్ధికల్చర్, ఫిషరీ లో మాత్రమే కాస్తో కూస్తో అభివృద్ధి కనిపించగా.. దానిని మొత్తం అన్ని శాఖలకు ఆపాదించే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం.

 

ఆయన  చేసిన ఈ మాటలకు డిప్యుటీ సీఎం కేఈ కృష్ణమూరి, ఆర్థిక శాఖ మంత్రి యనమల కూడా తానా అంటే తందానా అన్నారు. బాబు వల్లించిన మాటలనే వీరు మళ్లీ చెప్పారు.

 

 

click me!