అల్లూరి జిల్లా వైసీపీలో వర్గపోరు.. ఫాల్గుణ వద్దంటూ నినాదాలు, సుబ్బారెడ్డి ముందే బాహాబాహీ

Siva Kodati |  
Published : Aug 16, 2023, 06:08 PM IST
అల్లూరి జిల్లా వైసీపీలో వర్గపోరు.. ఫాల్గుణ వద్దంటూ నినాదాలు, సుబ్బారెడ్డి ముందే బాహాబాహీ

సారాంశం

అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. అరకు కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.  జగన్ ముద్దు-ఫాల్గుణ వద్దు అంటూ స్లోగన్స్ ఇచ్చారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. అరకు కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఫాల్గుణ వ్యతిరేక వర్గీయులు ఆయనకు వ్యతిరేక నినాదాలతో హోరేత్తించారు. జగన్ ముద్దు-ఫాల్గుణ వద్దు అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి సమావేశం నిర్వహించారు. 

ఇకపోతే.. గత నెలలో ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు, పీడీసీసీ బ్యాంకు మాదాసి వెంకయ్య వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అశోక్‌బాబు అనుచరులు వీరంగం సృష్టించారు. మాదాసి వెంకయ్యపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే అడ్డుపడిన మాదాసి వెంకయ్య అనుచరుల్లో కొందరికి గాయాలయ్యాయి. వివరాలు.. టంగుటూరు జాతీయ రహదారిపై ఓ టీ దుకాణం వద్ద అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గీయుల మధ్య మాటామాటా పెరిగింది. 

ఈ క్రమంలోనే అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గం నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. మాదాసి వెంకయ్యపై అశోక్‌బాబు అనుచరులు  దాడికి యత్నించారు. అయితే వెంకయ్యను ఆయన అనుచరులు వాహనం ఎక్కించి పంపించారు.ఈ ఘర్షణలో వెంకయ్య అనుచరుల్లో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్