న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
తిరుపతి: న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శుక్రవారం నాడు తిరుమల వెంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ దంపతులు సందర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామి వారి ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకొన్నానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జస్టిస్ ఎన్వీరమణ తొలిసారిగా తిరుమలకు వచ్చారు. ఈ బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందు ఆయన తిరుమల బాలాజీని దర్శించుకొన్నారు.
also read:శ్రీవారి ఏకాంత సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (ఫొటోలు)
సీజేఐ ఎన్వీరమణకు తిరుమలలో టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఎన్వీ రమణ కుటుంబసభ్యులు గురువారం నాడే తిరుపతికి చేరుకొన్నారు. గురువారం నాడు రాత్రి ఎన్వీ రమణ తిరుమలకు చేరుకొన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్వీ రమణ తిరుమల నుండి హైద్రాబాద్ కు చేరుకొంటారు. చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు కీలకమైన తీర్పులు ఇచ్చారు.