విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు.
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ రెండో రోజూ శుక్రవారం నాడు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం జగన్ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.
also read:కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయాన్ని సీఎం జగన్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉమ్మడి ఏపీ వాసులు ఆనాడు చేసిన పోరాటం గురించి జగన్ ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ ముగిసిన తర్వాత మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. బుధవారం నాడు రాత్రి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తో జగన్ భేటీ అయ్యారు.