శ్రీహరికోటలో విషాదం: రెండు రోజుల క్రితం మృతి చెందిన సీఐఎస్ఎఫ్ ఎస్ఐ భార్య సూసైడ్

By narsimha lode  |  First Published Jan 18, 2023, 9:20 AM IST

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రంలో  ఆత్మహత్య చేసుకున్న సీఐఎస్ఎప్  ఎస్ఐ వికాస్ సింగ్ భార్య  కూడ సూసైడ్  చేసుకుంది. 


నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో  రెండు రోజుల క్రితం  ఆత్మహత్య చేసుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ భార్య  బుధవారంనాడు ఆత్మహత్య చేసుకుంది.  ఈ నెల  16వ తేదీన  శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో  విధులు నిర్వహిస్తున్న  సీఐఎస్ఎప్ ఎస్ఐ వికాస్ సింగ్  తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు తెల్లవారుజామున  చింతామణి అనే  సీఐఎస్ఎఫ్ జవాన్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  చింతామణిది  ఛత్తీస్ ఘడ్  రాష్ట్రం . వికాస్ సింగ్ ది  బీహర్ రాష్ట్రం.   వికాస్ సింగ్  దంపతులకు ముగ్గురు పిల్లలు. బీహర్ రాష్ట్రానికి చెందిన వికాస్ సింగ్  విధి నిర్వహణలో భాగంగా  షార్ సెంటర్ లో  పనిచేస్తున్నాడు.  వికాస్ సింగ్  ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని  సీఐఎస్ఎఫ్  అధికారులు  వికాస్ సింగ్  కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వికాస్ సింగ్  భార్య , ఇతర కుటుంబ సభ్యులు  శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రానికి  చేరుకున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేక  తాము బస చేసిన  గెస్ట్ హౌస్ లో  వికాస్ సింగ్  ఆత్మహత్య చేసుకుంది.

also read:నెల్లూరు జిల్లాలో విషాదం: శ్రీహరికోటలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

Latest Videos

నెల్లూరులోని షార్ సెంటర్ లో  విధులు నిర్వహిస్తున్న  సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎందుకు  ఆత్మహత్యలకు  పాల్పడుతున్నారనే  విషయమై  ప్రస్తుతం  చర్చ సాగుతుంది. గతంలో  కూడా  ఇదే తరహలో సీఐఎస్ఎఫ్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై  సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు  కమిటీని ఏర్పాటు  చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు  జరగకుండా ఈకమిటీ సిఫారసులను  పాటిస్తామని అధికారులు ప్రకటించారు.  అయినా కూడా ఒకే రోజు ఇద్దరు  సీఐఎస్ఎప్ సిబ్బంది  ఆత్మహత్యలకు పాల్పడడం  చర్చకు దారి తీసింది.ఈ ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్యలకు  గల కారణాలపై  ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
 

click me!