అసభ్యకరంగా పవన్ తల్లి ఫోటోలు మార్ఫింగ్..వైరల్

By ramya neerukondaFirst Published 28, Aug 2018, 12:56 PM IST
Highlights

‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ ఫొటోలను చూసిన శ్రవణ్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లాడు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తల్లిని మరోసారి వివాదంలోకి లాగారు. గతంలో నటి శ్రీరెడ్డి.. పవన్ తల్లిని దూర్భాషలాడుతూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. కాగా.. తాజాగా పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ ఫొటోలను చూసిన శ్రవణ్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. 

అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి సైబర్ క్రైమ్ విభాగంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, పవన్‌ తల్లిని వివాదాల్లోకి లాగడంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అభిమానులు కోరుతున్నారు.
 

రాజకీయంగా పవన్ ని ఎదుర్కొనలేక.. ఆయన శత్రువులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పవన్ అభిమానులు ఆరిపిస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందేమోనని ఆరా తీస్తున్నారు

Last Updated 9, Sep 2018, 11:13 AM IST