డాక్టర్ అనితారాణి వివాదం: విచారణకు చిత్తూరుకు చేరుకొన్న సీఐడీ

Published : Jun 09, 2020, 12:29 PM ISTUpdated : Jun 09, 2020, 01:06 PM IST
డాక్టర్ అనితారాణి వివాదం: విచారణకు చిత్తూరుకు చేరుకొన్న సీఐడీ

సారాంశం

డాక్టర్ అనితారాణి వ్యవహారంపై విచారణ చేసేందుకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసు విచారణ చేసేందుకు సీఐడీ అధికారులు మంగళవారం నాడు ఉదయం చిత్తూరుకు చేరుకొన్నారు.


చిత్తూరు: డాక్టర్ అనితారాణి వ్యవహారంపై విచారణ చేసేందుకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసు విచారణ చేసేందుకు సీఐడీ అధికారులు మంగళవారం నాడు ఉదయం చిత్తూరుకు చేరుకొన్నారు.

also read:డాక్టర్ అనితారాణి వివాదం: సీఐడికి అప్పగించిన వైఎస్ జగన్

డాక్టర్ అనితారాణి  చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తోంంది. తనను వైఎస్ఆర్‌సీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
డాక్టర్ అనితా రాణి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ నెల 7వ తేదీన పోస్టు చేశారు.

ఈ విషయమై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. డాక్టర్ అనితారాణి పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తోంది. డాక్టర్ అనితారాణి విషయంలో డిఎంహెచ్ఓ రమాదేవి  ప్రభుత్వానికి నివేదిక కూడ ఇచ్చారు. 

అనితారాణి ఆడియో వ్యవహరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు అదేశించింది.ఈ కేసు విచారణ చేసేందుకు గాను చిత్తూరుకు సీఐడీ అధికారులు చేరుకొన్నారు. పెనుమూరు పోలీస్ స్టేషన్ నుండి కేసును తీసుకొన్న సీఐడీ అధికారులు.డాక్టర్ అనితారాణి పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?