రమేష్ ఆస్పత్రికి రఘురామ తరలింపునకు కోర్టు ఆదేశాలు: సవాల్ చేసిన సిఐడి

By telugu teamFirst Published May 17, 2021, 11:27 AM IST
Highlights

రఘురామ కృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలనే కింది కోర్టు ఆదేశాలను సిఐడి హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

అమరావతి: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలనే కింది కోర్టు ఆదేశాలను సిఐడి ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు సిఐడి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ మీద విచారణకు హైకోర్టు అనుమతించింది. 

రమేష్ ఆస్పత్రిలో రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనను సిఐడి కస్టడీలో కొట్టారని రఘురామ కృష్ణమ రాజు చేసిన ఫిర్యాదుపై కోర్టు స్పందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రమేష్ ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించాలని ఆదేశించింది. అయితే, రఘురామ కృష్ణమ రాజుకు రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించలేదు. దీంతో రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదివారంనాడు డివిజన్ బెంచ్ ఆదేశించింది. 

రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆ ఆస్పత్రి ఎండీపై కూడా కేసులున్నాయని, అందువల్ల ప్రభుత్వంపై ఆ ఆస్పత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉందని ఏఏజీ వాదించారు. దీంతో ఆ మేరకు పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. దీంతో సోమవారంనాడు సిఐడి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 

రఘురామకృష్ణమ రాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని అదివారంనాడు ఆదేశించింది. కానీ, రఘురామకృష్ణమ రాజును జిల్లా జైలుకు తరలించారు.  దాంతో రఘురామకృష్ణమ రాజు గుంటూరు జిల్లా జైలులోనే ఉన్నారు. ఇదిలావుంటే, రఘురామ కృష్ణమ రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. 

click me!