విజయవాడ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో.. హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్న చంద్రబాబు పిటిషన్‌ను సీఐడీ వ్యతిరేకించింది.
విజయవాడ: విజయవాడ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో.. హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్న చంద్రబాబు పిటిషన్‌ను సీఐడీ వ్యతిరేకించింది. సీఆర్‌పీసీలో హౌస్ రిమాండ్ అనేదే లేదని తెలిపింది. హౌస్ అరెస్ట్ అడుగుతున్న చంద్రబాబు.. బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని పేర్కొంది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. చంద్రబాబును హౌస్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. కోర్టు ఆదేశాల ప్రకారం జైలులోనే చంద్రబాబుకు అన్నివసతులు కల్పించామని తెలిపింది. మరో రెండు కేసుల్లో కూడా చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై లంచ్ బ్రేక్ తర్వాత విచారణ జరగనుంది.
ఇక, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. చంద్రబాబు తరఫున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదని అన్నారు. భద్రతాపరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచిచోటు వేరే ఉండదని అన్నారు.