చంద్రబాబు కేసు.. ఏఏజీ సుధాకర్ రెడ్డి భద్రత పెంపు.. ఉత్తర్వులు జారీ..

 ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

AP Government Increased security to AAG Ponnavolu Sudhakar Reddy who argued chandrababu Case ksm

విజయవాడ: ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ రెడ్డికి భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 4+4 గన్‌మెన్లతో ఆయన భద్రత కల్పించనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఏఏజీ సుధాకర్ రెడ్డి.. స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్ కోసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ఆయన భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

vuukle one pixel image
click me!