లైంగిక కోరిక తీర్చాలని బలవంతపెట్టిన సిఐపై వేటు

Published : Apr 30, 2019, 08:01 AM IST
లైంగిక కోరిక తీర్చాలని బలవంతపెట్టిన సిఐపై వేటు

సారాంశం

సీఐ సన్యాసినాయుడుపై పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డాకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

విశాఖపట్నం: న్యాయం కోసం వచ్చిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని వేధించిన సిఐ సన్యాసినాయుడిపై వేటు పడింది. తన సోదరికి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడనే వార్తలు వచ్చాయి. 

సీఐ సన్యాసినాయుడుపై పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డాకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఫిర్యాదుదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని మహేశ్ చంద్ర లడ్డా హెచ్చరించారు.

పల్లా కృష్ణకుమారి అనే యువతి ప్రేమలో మోసపోయింది. ఆ మోసంపై రెండు నెలల క్రితం ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్ లో ఆమె సోదరి పల్లా మీనాక్షి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఎంవీపీ జోన్ సీఐ  సన్యాసినాయుడు వాళ్లకు న్యాయం చేయాల్సిందిపోయి.. వేధించడం మొదలుపెట్టాడనే ఆరోపణలు వచ్చాయి

సంబంధిత వార్త

న్యాయం కోసం స్టేషన్ కి వెళితే... కోరిక తీర్చమన్నాడు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?