
ఏలూరు రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం రైల్వే టెక్నికల్ వ్యాగన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బోగి మొత్తం వ్యాపించాయి. వ్యాగన్‌లో ఆయిల్ టిన్నులు వుండటంతోనే మంటలు వాటికి అంటుకోవడంతోను ప్రమాద తీవ్రత ఎక్కువగా వుంది. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్టేషన్‌లోవున్న ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.