క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం.. అందుకోసం సలహాదారుడిని నియమిస్తానని హామీ..

Published : Feb 28, 2023, 03:14 PM ISTUpdated : Feb 28, 2023, 03:20 PM IST
క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం.. అందుకోసం సలహాదారుడిని నియమిస్తానని హామీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌తో సమావేశమైనవారిలో రాష్ట్రంలోని పలువురు బిషప్‌లు, క్రైస్తవ నాయకులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్‌తో సమావేశమైనవారిలో రాష్ట్రంలోని పలువురు బిషప్‌లు, క్రైస్తవ నాయకులు ఉన్నారు. వీరంతా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చిస్ తరఫున సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోని చర్చిలకు సంబంధించిన ఆస్తులను కాపాడాలని కోరుతూ సీఎం జగన్‌కు క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రాల చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చింది. 

ఈ సందర్భంగా చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఎస్పీ, కలెక్టర్‌లు జిల్లా స్ధాయిలో సమస్యల పరిష్కరిస్తారన్న చెప్పారు. ఇక, తమ ఆస్తులు లాక్కుంటున్నారని, వాటిని రక్షించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందం తమ అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే స్థానిక పన్నులు చెల్లించకుండా స్వచ్ఛంద సంస్థలను మినహాయించాలని అభ్యర్థించినట్టుగా తెలిపింది. అలాగే తమ సంఘం కోసం ప్రత్యేక శ్మశానవాటికల అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని పేర్కొంది.

అలాగే చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. క్రైస్తవ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసేందుకు త్వరలో ఒక సలహాదారుని నియమిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చినట్లు క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!