చిత్తూరులో నిఫా కలకలం: రుయాలో డాక్టర్‌కు చికిత్స

First Published Jun 3, 2018, 11:09 AM IST
Highlights

కేరళ నుండి వచ్చిన డాక్టర్ కు నిఫా లక్షణాలు

తిరుపతి: కేరళ నుండి వచ్చిన ఓ డాక్టర్‌కు నిఫా వైరస్
సోకినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రుయా
ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.పరీక్షల తర్వాత ఆమెకు నిఫా సోకలేదని వైద్యులు తేల్చారు.

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ డాక్టర్  కేరళలో డాక్టర్
గా పనిచేస్తున్నారు. నిఫా వైరస్ సోకినవాళ్ళకు ఆమె వైద్య
చికిత్స నిర్వహించారని సమాచారం. 

వివాహం కుదరడంతో ఆమె తన స్వగ్రామం మదనపల్లికి
వచ్చారు. నిఫా సోకిన రోగులకు చికిత్స చేసిన వైద్యులు
ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం
కొన్నినిబంధనలను విధించింది. 

పరీక్షలు నిర్వహించుకొని నిఫా వైరస్ లేదని ఈ పరీక్షల్లో
తేలితేనే  ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు అనుమతిని
ఇస్తారు.

కేరళ నుండి వచ్చిన డాక్టర్ మాత్రం అక్కడ వైద్య పరీక్షలు
నిర్వహించుకోకుండానే ఏపీకి వచ్చింది. దీంతో కేరళ సర్కార్
ఏపీ ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చింది. 

రుయా డాక్టర్లు కేరళ నుంచి వచ్చిన వైద్యురాలిని పరీక్షలు
నిర్వహించగా ప్రాథమికంగా నిఫా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు.
 

జిల్లాలో నిఫా కేసు ఒక్కటి కూడ నమోదు కాలేదనిచిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న
ప్రకటించారు. ఈ విషయమై  ప్రజలు ఆందోళన చెందాల్సిన
అవసరం లేదన్నారు. కేరళ నుండి వచ్చిన డాక్టర్ కు కూడ పరీక్షలు నిర్వహించి నిఫా లేదని తేల్చినట్టు ఆయన చెప్పారు.

click me!