నారా లోకేష్ పాదయాత్రకు చిత్తూరు ఎస్పీ అనుమతి.. ఈ షరతులు పాటించాల్సిందే..

By Sumanth KanukulaFirst Published Jan 24, 2023, 1:38 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టున్న పాదయాత్రకు చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జిల్లాలో లోకేష్ పాదయాత్రకు పలు షరతులు విధించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టున్న పాదయాత్రకు చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జిల్లాలో లోకేష్ పాదయాత్రకు పలు షరతులు విధించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పాదయాత్ర అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పారు.  పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని స్పష్టం చేశారు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని.. రోడ్డపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదని తెలిపారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి నిర్వాహకులు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలని స్పష్టం చేశారు. 

ఎలాంటి ఫైర్ క్రాకర్స్ పేల్చడంపై పూర్తిగా నిషేధం అని చెప్పారు.  వారి పార్టీ కార్యకర్తలు, సమావేశంలో పాల్గొనేవారు సమావేశంలోకి ఎటువంటి మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్వాహకులు డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలని కోరారు. ఈ నిబంధనలకు లోబడి పాదయాత్రను చేసుకోవాలని తెలిపారు. అయితే పోలీసులు విధించిన షరతులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అదే రోజు రాత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 27వ తేదీ కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

click me!