పేరుకు రాయలసీమలో భాగంగా వున్నప్పటికీ ప్రశాంతతకు చిత్తూరు నగరం మారు పేరు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, జనతా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ , వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నియోజకవర్గాల్లో చిత్తూరు ఒకటి. పేరుకు రాయలసీమలో భాగంగా వున్నప్పటికీ ప్రశాంతతకు ఈ నగరం మారు పేరు. అలాంటిది 2015లో చిత్తూరు మేయర్ కఠారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్‌లను ఏకంగా మేయర్ ఛాంబర్‌లోనే పట్టపగలు దారుణంగా హత్య చేయడం యావత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఘటనలు లేనప్పటికీ.. చిత్తూరు నివురుగప్పిన నిప్పులా వుంటుందని నిపుణులు అంటూ వుంటారు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, జనతా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ , వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు.
చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. సీకే బాబు అడ్డా :
undefined
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. ఇక్కడి నుంచి సీకే జయచంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున మూడు సార్లు, ఇండిపెండెంట్‌గా ఒకసారి విజయం సాధించారు. చిత్తూరు అంటే సీకే బాబు.. సీకే బాబు అంటే చిత్తూరు అన్నంతగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. చిత్తూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఆయన అనుచరగణం వుంది. వైఎస్ హయాంలో రాయలసీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గానూ పనిచేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 స్థానాల్లో 14 చోట్ల టీడీపీ గెలవగా.. ఒక్క చిత్తూరులో మాత్రం కాంగ్రెస్ జెండా రెపరెపలాడిందంటే బాబు వల్లనే. కొంతకాలం పాటు ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగానూ వున్నారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు చిత్తూరు నగరంలో కనిపిస్తాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,01,690 మంది. వీరిలో పురుషులు 98,610 మంది.. మహిళలు 1,03,046 మంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆరణి శ్రీనివాసులుకు 91,206 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్ధి ఏఎస్ మనోహర్‌కు 51,238 ఓట్లు పడ్డాయి. మొత్తంగా వైసీపీ 39,968 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా చిత్తూరులో పాగా వేసింది.
చిత్తూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ :
2024 ఎన్నికల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ దక్కదని తేలడంతో ఆయన జనసేనలో చేరారు. దీంతో ఎంసీ విజయేంద్ర రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు జగన్. టీడీపీ విషయానికి వస్తే.. టీడీపీ అభ్యర్ధిగా గురజాల జగన్ మోహన్‌ను ప్రకటించారు.