నేడు జగన్‌తో భేటీ కానున్న కరణం బలరాం: వైసీపీలోకి కరణం కుటుంబం

By narsimha lode  |  First Published Mar 12, 2020, 12:29 PM IST

చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎం వైఎస్ జగన్‌ను కలవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. జగన్ సమక్షంలో కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది. 
 


ఒంగోలు: చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎం వైఎస్ జగన్‌ను కలవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. జగన్ సమక్షంలో కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది. 

గురవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు  కరణం బలరామకృష్ణమూర్తి  తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలవనున్నారు.2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో  చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించారు. 

Latest Videos

undefined

మాజీ మంత్రి పాలేటీ రామారావుతో పాటు తనయుడు వెంకటేష్‌తో కలిసి  కరణం బలరామకృష్ణమూర్తి చీరాల నుండి  తాడేపల్లికి ఇవాళ ఉదయం బయలుదేరారు.  జగన్ సమక్షంలో కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిలు వైసీపీకి జై కొట్టారు. తాజాగా కరణం బలరామకృష్ణమూర్తి కూడ ఇవాళ వైసీపీలో చేరనున్నారు.

Also read:ప్రకాశంలో బాబుకు గట్టి ఎదురు దెబ్బ: వైసీపీలోకి కరణం బలరాం..?

మరో వైపు ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుండి టీడీపీలో చేరిన సమయం నుండి కరణం బలరామకృష్ణమూర్తి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   పార్టీ సమావేశంలో గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు కరణం వర్గీయులు గతంలో బాహ బాహీకి దిగిన విషయం తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో  పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కరణం బలరాం స్ధబ్దుగా ఉన్నారు. తన అనుచరులతో కూడ బలరాం పార్టీ మార్పుపై చర్చించారు. పార్టీ మార్పు విషయంలో పార్టీ క్యాడర్ కూడ సానుకూలంగా ఉందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో  కరణం బలరాం  టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.

వైసీపీ ప్రభంజనంలో కూడ తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన  ప్రజలకు న్యాయం చేసేందుకు గాను తాను సీఎంను కలవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కరణం బలరాం  గురువారం నాడు మీడియాకు చెప్పారు. 

 
 


 

click me!