హైకోర్టులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్: ఈ నెల 31 విచారణకు ఛాన్స్

By narsimha lodeFirst Published Jul 28, 2020, 12:59 PM IST
Highlights

పిల్లల అక్రమ రవాణ కేసులో ఏ-1 నిందితురాలు డాక్టర్ నమ్రత హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్ నమ్రత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి:  పిల్లల అక్రమ రవాణ కేసులో ఏ-1 నిందితురాలు డాక్టర్ నమ్రత హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్ నమ్రత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

పిల్లలను పోషించలేని తల్లిదండ్రులను గుర్తించి వారికి ముందుగానే డబ్బులు చెల్లించి చిన్నారులను విక్రయించారని డాక్టర్ నమ్రతపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్ నమ్రత ఏపీ హైకోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 31 వ తేదీన విచారణ జరగనుంది.

 నమ్రతకు ఆగస్టు 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఆమెను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.పసికందులను విక్రయించే ఒక ముఠాను విశాఖ పోలీసులు పట్టుకొన్నారు.  యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ముసుగులో కొన్నేళ్లుగా పసిపిల్లల్ని విక్రయిస్తోందని పోలీసులు గుర్తించారు. గుట్టుగా సాగుతున్న ఈ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్‌ పచ్చిపాల నమ్రత పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

click me!