చీమకుర్తి సభలో నవ్వుల పూవులు.. వైఎస్ రాజన్న పాట అందుకున్న జెడ్పీ చైర్‌పర్సన్.. సీఎం జగన్ ఏం చేశాడంటే?

By Mahesh KFirst Published Aug 24, 2022, 6:39 PM IST
Highlights

చీమకుర్తి సభలో సీఎం జగన్ నవ్వుల పూవులు పూయించారు. జెడ్పీ చైర్ పర్సన్ రాజశేఖరుడిపై పాట అందుకోవడంతో అందరి ముఖాలూ మెరిశాయి. కానీ సమయాభావం కావడంతో ఆమెను ఆగమన్నా ఆగకుండా పాట కొనసాగించింది. దీంతో సీఎం స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.

అమరావతి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్సార్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సభలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కొన్ని క్షణాలపాటు అతిథులు, హాజరైన ప్రజలు అంతా నవ్వులు పూవులు పూయించారు. 

ఈ సభలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడటానికి లేచారు. చాలా మంది ఆమెను మాట్లాడటానికి ఆహ్వానించారు. ఆమె సభపై ఉన్న అతిథులు అందరినీ ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ఒక్కొక్కరిని ఆమె ప్రస్తావించిన తర్వాత ఎవరూ ఊహించని రీతిలో పాట అందుకున్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కీర్తిస్తూ రాసిన పాటను ఆమె పాడారు. ఆమె పాట అందుకోగానే జనాలు అంతా ఒక్కసారిగా అరుపులతో ప్రోత్సహించారు. కానీ, ఆమె చిన్నగా పాడి వెళ్లిపోలేదు. మొత్తంగా పాటను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. 

ఆమె పాటను ఆపాల్సిందిగా నిర్వాహకులు ఆమెకు తెలియజేశారు. సభా సమయం మించిపోతున్నదని మొర పెట్టుకున్నారు. కానీ, ఆమె గానంలో పడిపోయి సమయాన్ని, వారు చేస్తున్న హెచరికలను పట్టించుకోలేదు. సీఎం కూడా ఆయన కూర్చున్న చోట నుంచి ఆమె వైపు చూస్తూ ఇక పాట ఆపేసి రావాల్సిందిగా సూచించాడు. జడ్జీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాత్రం వెనక్కి రాలేదు. కాసేపు చూస్తూ కూర్చచున్న సీఎం ఇక పైకి లేచాడు. నేరుగా ఆమె దగ్గరకు వెళ్లాడు. సీఎం లేవడంతో సభ మొత్తం కూడా గౌరవ సూచిగాలేచి నిలబడ్డారు. ఆయన నేరుగా అమ్మా అని పిలుచుకుంటూ వెంకాయమ్మ దగ్గరకు వెళ్లారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఇక చాలు అంటూ తాను కూర్చున్న సీటు వద్దకు తీసుకెళ్లాడు. ఈ ఘటన పై సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

click me!