Andhra Pradesh: దేశంలోనే మొట్ట‌మొద‌టి మెరైన్ వెల్‌నెస్ టౌన్‌షిప్‌.. ఎక్క‌డో కాదండోయ్

Published : Jun 04, 2025, 02:12 PM IST
Chaturvatika Township

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతికి కేరాఫ్‌గా నిలిచే ఒంగోలు బ్యాక్ వాట‌ర్స్ వ‌ద్ద 'EBG గ్రూప్' రూపొందించిన చతుర్వాటిక అనే వెల్‌నెస్ టౌన్‌షిప్ నిర్మాణం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

50 ఎకరాల్లో విస్తరించిన ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రాజెక్ట్

చదలవాడ వద్ద 50 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో 133 విల్లాలు 24 ఎకరాల్లో ఏర్పాటు కాగా, మిగిలిన భూమిలో పచ్చదనం, ధ్యానం, ఆరోగ్య సేవల కేంద్రాలు ఉన్నాయి. 3BHK నుంచి 5BHK వరకూ ఉన్న ఈ విల్లాలు వాస్తుకు అనుగుణంగా నిర్మించారు. ప్రైవేట్ గార్డెన్‌లు, బ్యాక్ వాట‌ర్ వ్యూ, స్మార్ట్ హోమ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయి.

భారతదేశంలో మొట్టమొదటి మెరైన్ వెల్‌నెస్ రిసార్ట్ – ‘క్రిల్లం’

చతుర్వాటికలో ఉన్న క్రిల్లం రిసార్ట్ అనేది భారత్‌లో నివాస సముదాయంలో నిర్మించిన మొదటి మెరైన్ వెల్‌నెస్ కేంద్రం. ఇందులో పంచకర్మ, యోగా, ధ్యాన కార్యక్రమాలు శ్రీ శ్రీ రవిశంకర్ తత్వబోధక బృందం ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తారు.

క‌నెక్టివిటీతో పాటు ప్ర‌శాంతత

ఒంగోలు సమీపంలోని NH-16, రాబోయే విమానాశ్రయం, వందే భారత్ రైలు కనెక్టివిటీ వంటివి ఈ ప్రాజెక్ట్‌కు చేరువ‌లో ఉంటాయి. అలాగే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, జీఐ ట్యాగ్ పొగాకు, ఆక్వా ఫార్మింగ్ వంటివి కూడా దీనికి చేరువ‌లో ఉంటాయి.

సమగ్ర ఆరోగ్య, భద్రతా మద్దతు

మెరైన్ గాలి, తక్కువ TDS నీరు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావార‌ణం వీటి సొంతం. అత్య‌వ‌స‌ర వైద్య స‌దుపాయాల కోసం హెలి అంబులెన్స్ అందుబాటులో ఉంది. పర్యావరణ అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఆధ్యాత్మిక మండపాలు, దేవాలయాలను ఏర్పాటు చేశారు.

విలాసవంతమైన జీవనం కూడా:

ధ్యాన ఉద్యానవనాలు, క్లబ్‌హౌస్, అంపిథియేటర్, మినీ థియేటర్, స్మార్ట్ విల్లాలు & ప్రైవేట్ తోటలు, జాగింగ్ ట్రాక్‌లు, స్కేటింగ్ రింక్, క్రికెట్ నెట్‌లు ATM, సూపర్ మార్కెట్, ఆర్గానిక్ స్టోర్, స్కూల్‌, 24x7 భద్రత, హెలిప్యాడ్, మినీ క్లినిక్ వంటి విలాస‌వంత‌మైన జీవనానికి అవ‌స‌ర‌మైన సేవ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ. 500 కోట్లతో

చతుర్వాటిక కేవలం ఒక టౌన్‌షిప్ కాదు. ఇది ఆధ్యాత్మికత, ఆరోగ్యం, గృహ జీవన పరంగా మార్గదర్శకమైన ఉద్యమం. టియర్-2 నగరాల్లో ఇదొక విలాసానికి, సుస్థిరతకు మార్గంగా నిలుస్తోంది.

మీ భవిష్యత్తుకి భ‌ద్ర‌త

మీరు ఒక గ్లోబల్ ప్రొఫెషనల్, హై నెట్ వర్త్ వ్యక్తి, లేదా ఆరోగ్య ఆధారిత పెట్టుబడి కోసం చూస్తున్న వారికి చతుర్వాటిక బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఇది మీ జీవన విధానాన్ని మార్చే చోటు. ప‌రిమిత విల్లాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివ‌రాల కోసం ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu