వరద నష్టం: కేరళ తరఫున చంద్రబాబు వకాల్తా

By sivanagaprasad KodatiFirst Published Aug 20, 2018, 7:26 PM IST
Highlights

 ప్రకృతి భీభత్సంతో అతాలకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు మానవతా ధృక్పథంతో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ రూపాలలో 50 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేసినట్లు సీఎం స్పస్టం చేశారు.

అమరావతి: ప్రకృతి భీభత్సంతో అతాలకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు మానవతా ధృక్పథంతో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ రూపాలలో 50 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేసినట్లు సీఎం స్పస్టం చేశారు. 
 దేశంలో విపత్తు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు మనసున్న మారాజులు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

సినీనటులు, సెలబ్రిటీలు, వ్యాపారులు కేరళ బాధితులకు అండగావ ఉండటం శుభపరిణామం అన్నారు. డబ్బులు సంపాదించడమే కాదు ఆ డబ్బును సాటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు వినియోగించడం మంచిదని సూచించారు. ప్రజలు ఎవరికి తోచిన వారు మానవతా ధృక్పథంతో సాయం చెయ్యాలని విజ్ఞప్తి. 

మరోవైపు కేంద్రప్రభుత్వం 600 కోట్ల రూపాయలు మెుక్కుబడిగా కేటాయించడం సరికాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు 80శాతం నాశనమైనప్పుడు కేంద్రం మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కేరళలో దాదాపు 20 వేల కోట్లు నష్టం జరిగితే 600 కోట్లు మాత్రమే కేటాయించడం సబబు కాదన్నారు. 

కేరళ వరదలపై యావత్ ప్రపంచం స్పందిస్తుంటే కేంద్ర సరిగ్గా స్పందించకపోవడం సరికాదన్నారు. కేంద్రప్రభుత్వం కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళ యధాస్థితికి వచ్చే వరకు వాళ్లకు భరోసా ఇవ్వాలన్నారు. మరోవైపు హుదూద్ తుఫాన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 1000కోట్లు ప్రకటించిన కేంద్రం కేవలం  650 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఇంకా 350 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.  
 

 2019కి పోలవరం పూర్తి చేస్తాం... 

అమరావతి:పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 57.57 శాతం పూర్తయ్యిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఖర్చుపెట్టిన 2,662 కోట్ల రూపాయలు కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతోబాటు డీపీఆర్ కేంద్రం చెల్లించాల్సి ఉందన్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయన్నారు. అయినా వాటన్నంటిని అధిగమించామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా భూసేకరణ చెయ్యాల్సి ఉందని అది పూర్తి చేసి మే నెలాఖరుకు ప్రాజెక్టు పూర్తి చేసి నీరందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హమీ ఇచ్చారు.  

పట్టిసీమతో చరిత్ర సృష్టించాం....

అలాగే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించామని సీఎం చంద్రబాబు నాయుడు స్పస్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ రైతులను రెచ్చగొట్టిందన్నారు. తూర్పుగోదావరి ఎడారి అయిపోతుందంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పట్ల ప్రతిపక్ష పార్టీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందన్నారు. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. 

అయితే పట్టిసీమ ప్రాజెక్టు ప్రస్తుతం మంచి ఫలితాలను అందిస్తుందన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు ఒక వరంగా మారిందన్నారు. పట్టిసీమ సిరులు కురిపించే ఎత్తిపోతల పథకంగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామన్నారు.
 

 

click me!