పోలీసుల వేధింపుల వల్లే సలాం ఫ్యామిలీ సూసైడ్, మాపై నిందలా?: చంద్రబాబు

By narsimha lodeFirst Published Nov 12, 2020, 1:43 PM IST
Highlights

 పోలీసుల  వేధింపుల వల్లే నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

అమరావతి: పోలీసుల  వేధింపుల వల్లే నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

గురువారం నాడు అమరావతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.బంగారం చోరీ చేయకపోయినా చేసినట్టుగా పోలీసులు సలాంను వేధింపులకు గురి చేశారన్నారు. 42 రోజుల పాటు అబ్దుల్ సలాం ను జైల్లో పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.

సలాం కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు. దీంతోనే సీఐ, కానిస్టేబుల్ కు బెయిల్ వచ్చిందన్నారు.

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై పోలీసులు పెట్టిన కేసుల్లో వారికి ఎన్ని రోజులకు బెయిల్ వచ్చిందో అందరికి తెలుసునని ఆయన చెప్పారు.సలాం కుటుంబం ఆత్మహత్యపై సరైన కేసులు పెట్టకుండా  తమ పార్టీపై నిందలు మోపుతున్నారని ఆయన ఆరోపించారు.

also read:అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త

రాష్ట్రంలో ఇప్పటివరకు పలువురు ముస్లింలపై నమోదైన కేసులు, వేధింపులను ఆయన గుర్తు చేశారు. శాసనమండలి ఛైర్మెన్ షరీప్ ను కూడ అబ్దుల్ సలాం మృతి కేసులో ఐపీఎస్ ఆఫీసర్లకు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలో తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఘటనపై ఐపీఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తమ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి రైతులపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు.

click me!