మోడీ అఖిలపక్ష భేటీకి బాబు గైర్హాజర్

By narsimha lodeFirst Published Jun 18, 2019, 5:13 PM IST
Highlights

ఈ నెల 19వ తేదీన ప్రధాని నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే విషయంలో  టీడీపీ  తర్జన భర్జన పడుతోంది. చంద్రబాబు స్థానంలో  పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశానికి పంపాలని  ఆ పార్టీ భావిస్తోంది.


అమరావతి: ఈ నెల 19వ తేదీన ప్రధాని నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే విషయంలో  టీడీపీ  తర్జన భర్జన పడుతోంది. చంద్రబాబు స్థానంలో  పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశానికి పంపాలని  ఆ పార్టీ భావిస్తోంది.

జమిలీ ఎన్నికలపై  ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో  ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆయా పార్టీల అధ్యక్షులకు  ఇప్పటికే లేఖలు పంపారు. అయితే  ఈ సమావేశానికి చంద్రబాబునాయుడు హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

బుధవారం నుండి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల మొదటి వారంలోనే చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లాలని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తన పర్యటనను వాయిదా వేసుకొన్నారు. 

బుధవారం నుండి  చంద్రబాబునాయుడు వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు.చంద్రబాబుకు బదులుగా ఈ సమావేశానికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను పంపాలని  ఆ పార్టీ ఆలోచనగా కన్పిస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా  స్పష్టత రాలేదు.
 

click me!