రాష్ట్రంలో ప్రజలకే కాదు...కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో ప్రజలకే కాదు...కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.
రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమన్నారు. శుక్రవారంనాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ అలసత్వం వల్లే ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
రాజమండ్రిలోవిఘ్నేశ్వరఆలయంలోసుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
విజయవాడలో దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతర్వేదిలో రధం తగులబెట్టిన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడిందని ఆయన ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్రంలో ఇటీవల కాలంలో దేవాలయాలపై దాడులు చోటు చేసుకొంటున్నాయి.