సీఎం నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది: చంద్రబాబు

By narsimha lodeFirst Published Dec 10, 2020, 5:38 PM IST
Highlights

ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే  మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. 
కడప జిల్లా పులివెందులలో దళిత మహిళపై హత్యాచారంపై డీజీపీకి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశాడు. 
 


అమరావతి:ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే  మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. 
కడప జిల్లా పులివెందులలో దళిత మహిళపై హత్యాచారంపై డీజీపీకి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశాడు. 

 మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి చంపడాన్నిఆయన తీవ్రంగా తప్పుబట్టారు.  రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు.

 రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారన్నారు.
ఈ క్రమంలోనే ఎప్.ఐ.ఆర్ లో గుర్తుతెలియని వ్యక్తులు అని నమోదు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

 రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు.  ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయాలని ఆ లేఖలో డీజీపీని కోరారు. మానవ హక్కుల దినోత్సవం నాడైనా కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని ఆయన సూచించారు.
 

click me!