వైసీపీ లెక్కలు తేలుస్తా, వారి సంగతి చూస్తా: చంద్రబాబు వార్నింగ్

Published : Feb 27, 2020, 11:08 AM IST
వైసీపీ లెక్కలు తేలుస్తా, వారి సంగతి చూస్తా: చంద్రబాబు వార్నింగ్

సారాంశం

తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లెయినర్లు అడ్డు పెట్టినా తన పర్యటన ఆగదని ఆయన చెప్పారు. వైసీపీ లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు.

విశాఖపట్నం: తన ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెసు (వైసీపీ)పై తీవ్రంగా మండిపడ్డారు. తన ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు. విశాఖపట్నానికి బయలుదేరే ముందు ఆయన టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

తన పర్యటనను అడ్డుకోవడానికి రోడ్లు తవ్వుతున్నవారి సంగతి తేలుస్తానని ఆయన అన్నారు. తన పర్యటనకు ఆంక్షలు పెట్టడం సరి కాదని అన్నారు. తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లెయినర్లు అడ్డు పెట్టినా తన పర్యటన ఆగదని చెప్పారు. తన పర్యటనను అడ్డుకోవడానికి వీర్రాజు చెరువు వద్ద రోడ్డును తవ్వేశారని చెప్పారు. వైజాగ్ బ్రాండ్ ను దెబ్బ తీసిన వైసీపికి తనను ప్రశ్నించే హక్కు లేదని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

చంద్రబాబును విమానాశ్రయం వద్దనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో విమానాశ్రయానికి వెళ్లే దారిలో వైసీపీ కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. విమానాశ్రయానికి వెళ్లే దారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

విమానాశ్రయానికి వెళ్లే రోడ్డుపై ఓ వైపు టీడీపీ కార్యకర్తలు, మరో వైపు వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, జై చంద్రబాబు అంటూ అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పోటాపోటీ నినాదాలతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు గురువారం విశాఖలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్తూ చంద్రబాబు మధ్యలో పెందుర్తి మండలంలోని భూసమీకరణ బాధితులతో మాట్లాడాలని అనుకున్నారు. చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?