క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు: లాయర్లతో లోకేష్ మంతనాలు, సుప్రీంను ఆశ్రయించనున్న బాబు

By narsimha lode  |  First Published Sep 22, 2023, 3:40 PM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో  ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు లాయర్లు భావిస్తున్నారు.


అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.   ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఏపీ హైకోర్టు తీర్పు  నేపథ్యంలో లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు లాయర్లతో  సమావేశమై చర్చించారు. ఈ విషయమై  సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు  స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఈ నెల  9వ తేదీన  ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఈ కేసులో  సీఐడీ  అధికారులు  రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు నుండి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.  చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత  ఆయనపై దాఖలైన కేసులపై వాదనలు విన్పించేందుకు  సుప్రీంకోర్టు లాయర్లు విజయవాడకు వచ్చారు. సిద్దార్ధ్ లూథ్రా చంద్రబాబు కేసులను వాదిస్తున్నారు. అంతేకాదు హరీష్ సాల్వే కూడ చంద్రబాబు తరపున వాదనలు విన్పించారు.

Latest Videos

undefined

also read:చంద్రబాబుకు షాక్: రెండు రోజులు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

సీఐడీ తరపున సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాది  ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే  ఏపీ హైకోర్టులో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని  టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై  టీడీపీ నేతలు లాయర్లతో చర్చించారు. వరుస కేసులతో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు  సీఐడీ అధికారులు రంగం సిద్దం చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసులలో పీటీ వారంట్ లు కూడ  కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబుపై దాఖలైన  కేసులను  చట్టపరంగా  ఎదుర్కొంటామని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

 

 


 

click me!