
అమరావతి: బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహా రావు వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏదో చేస్తామని అంటున్నారంటూ బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. టీడిపి పని 2019 ఎన్నికల్లో అయిపోతుందని అంటున్నారని, తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. బిజెపి నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు.
ఓ బిజెపి నాయకుడు తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోయిందని అంటున్నాడని, ఇంకో పక్క మనకు చుక్కులు చూపిస్తామని మాట్లాడారని, 15వ తేదీ తర్వాత చుక్కలు చూపిస్తామని అంటున్నారని ఆయన జీవిఎల్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికే స్థితి బిజెపి నాయకులు వ్చచారని, వాటిని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని, ఆ విషయాన్ని బిజెపి నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. న్యాయం చేయాలని తాను అడిగానని, కేంద్రం న్యాయం చేయలేదని, పైగా అన్యాయం చేసిందని, ఎపి కూడా దేశంలో భాగమేనని అన్నారు.
తమకూ హక్కులున్నాయని, విభజనలో అన్యాయం చేశారని అంటూ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎపికి జరిగిన అన్యాయానికి కాంగ్రెసు, బిజెపి రెండు పార్టీలు కూడా బాధ్యత వహించాలని అన్నారు.
ఢిల్లీకన్నా అద్భుతమైన రాజధాని కడుతామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్ిచ ఎపికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. దాంతో రాజధాని నిర్మాణం ఎలా అవుతుందని అడిగారు.